శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 22 జనవరి 2022 (15:56 IST)

ఆహ్లాదాన్నిచ్చే హుస్సేన్ సాగర్ తీరాన ‘లేక్‌ వ్యూ డెక్‌’...

ఫోటో కర్టెసి-ట్విట్టర్
హైదరాబాద్ పేరు చెప్పగానే ఎంతో ఆహ్లాదాన్ని కలిగించే ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్ గుర్తుకు వస్తాయి. ట్యాంక్ బండ్ వద్ద  అలా చల్లగాలికి కూర్చుంటే ఎంతో ఆహ్లాదాన్నిస్తుంది. ఇక్కడ అదనపు ఆకర్షణగా లేక్ వ్యూ డెక్ నిర్మించనున్నట్లు అధికారులు చెపుతున్నారు.

 
రష్యా రాజధాని మాస్కోలో వున్న పర్యాటక స్థలం ఫ్లోటింగ్ బ్రిడ్జిని పోలివుండే లేక్ వ్యూ డెక్ నిర్మించనున్నట్లు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ట్విట్టర్ ద్వారా తెలియజేసారు. నెక్లెస్ రోడ్డులో హుస్సేన్ సాగర్ పైన దీన్ని నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు.