1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: బుధవారం, 8 అక్టోబరు 2014 (20:23 IST)

'ఈ ఏజ్‌ అలాంటిది' అంటున్న దర్శకుడు

'పున్నమినాడు', 'యమహోయమ:' చిత్రాలు నిర్మించిన జి. విజయకుమార్‌ గౌడ్‌ మూడో చిత్రంగా 'ఈ ఏజ్‌ అలాంటిది'కి శ్రీకారం చుట్టారు. హృషీకేశ్‌, త్రిదేవ్‌, కార్తిక్‌, స్వప్ప, లుబ్న, నాగవల్లి ఇందులో హీరోహీరోయిన్లు. కె. భాగ్యరాజా శిష్యుడు విజయప్రకాష్‌ దర్శకుడుగా పరిచయమవుతున్నారు. మెహిదీపట్నంలోని అంబా థియేటర్‌ దగ్గర హారో రామ్‌చరణ్‌ కటౌట్‌ దగ్గర తొలి దృశ్యాన్ని చిత్రించారు. నిర్మాత ఆచంట గోపీనాథ్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, మల్టీడైమన్షన్‌ వాసు క్లాప్‌ ఇచ్చారు. 
 
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఉన్న వాస్తవిక స్థితిని ఇందులో ఆవిష్కరిస్తున్నాం. పిల్లలకు అడిగిందల్లా ఇచ్చేయడం తప్ప, వాళ్లేం చేస్తున్నారో సరైన మార్గంలో వెళ్తున్నారో లేదో తల్లిదండ్రులు పట్టించుకోవడం లేదు. ఇటువంటి తల్లిదండ్రులు, పిల్లల బాధ్యతలను తెలియజేస్తున్నాం అని చెప్పారు. 
 
చిత్ర నిర్మాత మాట్లాడుతూ... ఈ నెల 15 నుంచి 40 రోజుల పాటు ఏకధాటి షెడ్యూల్‌తో చిత్రీకరణ మొత్తం పూర్తవుతుంది. హైదరాబాద్‌, పాండిచ్చేరిల్లో షూటింగ్‌ చేస్తాం. ఇందులో నాలుగు పాటలుంటాయి అఁ చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: ముజీర్‌ మాలిక్‌, సంగీతం: శశాంక్‌ శివ సుబ్రహ్మణ్యం, సహ నిర్మాత: బాలాజీశ్రీను.