టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?
విశాఖపట్టణం నూకాలమ్మ ఆలయం వద్ద కొందరు వ్యక్తులు ఇద్దరు మహిళలు, ఓ పురుషుడిపై దాడి చేసి వారి తలలు పగులగొట్టిన సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంట్లోకి చొరబడి ఇద్దరు మహిళలు, ఓ పురుషుడిపై కొందరు వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేయడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి.
దాడి చేసినవారిని కంచరపాలెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాయాలపాలైన వారిని కేజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఐతే ఈ దాడి రాజకీయ కోణంలో జరిగిన దాడి కాదనీ, ఇది పూర్తిగా వ్యక్తిగతమైనదని పోలీసులు వెల్లడించారు.