సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Updated : బుధవారం, 25 అక్టోబరు 2023 (15:07 IST)

దాండియా ఆడుతున్న యువతిని తాకుతూ లైంగిక వేధింపులు, అడ్డుకున్న తండ్రి హత్య

rape
అమ్మాయిలపై వేధింపుల పరంపరం ఆగటంలేదు. దాండియా ఆడుతున్న తన కుమార్తెను లైంగికంగా వేధిస్తున్న వారిని అడ్డుకున్నందుకు ఆమె తండ్రిని హత్య చేసారు యువకులు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. హరియాణాలోని ఫరీదాబాద్ లోని రెసిడెన్షియల్ సొసైటీ ఏర్పాటు చేసిన గర్భా కార్యక్రమంలో ఓ యువతి దాండియా నాట్యం చేస్తుంది.

అదే సొసైటీకి చెందిన ఇద్దరు యువకులు సదరు యువతి ఫోన్ నెంబరు అడిగారు. అందుకు ఆమె నిరాకరించింది. దీనితో వాళ్లిద్దరూ ఆమె శరీరాన్ని అసభ్యంగా తాకుతూ దాండియా చేస్తున్న ఆమెపై లైంగిక వేధింపులకు గురిచేసారు. ఈ విషయాన్ని యువతి కుటుంబ సభ్యులకు తెలియజేసింది.
 
కుటుంబ సభ్యుల సదరు యువకులను నిలదీయడంతో గొడవ జరిగింది. మాటామాటా పెరిగి యువకులంతా మూకుమ్మడిగా యువతి తండ్రిని బలంగా కొట్టడంతో ఆయన కిందపడిపోయారు. వెంటనే సమీప ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.