గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 30 ఆగస్టు 2023 (16:45 IST)

బాగోలేదని బాబా దగ్గరికి వెళ్తే.. నవవధువు కళ్లకు గంతలు కట్టి..?

rape
ఆధునికత పెరుగుతున్నా బాబాల జోలికి వెళ్తున్న మహిళ సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా నగరంలో మరో దారుణం వెలుగుచూసింది. హైదరాబాద్‌లోని పాతబస్తీ బండ్లగూడలో ఓ నకిలీ బాబా దారుణానికి ఒడిగట్టాడు. ఓ నవవధువుకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆమె అత్తమామలు బాబా దగ్గరికి తీసుకెళ్లారు.
 
ఈ క్రమంలో నవ వధువుపై కన్నేసిన నకిలీ బాబా ఆమె అత్యాచారానికి పాల్పడ్డాడు. పక్క గదిలోకి తీసుకెళ్లి తన కళ్లకు గంతలు కట్టి బాబా తనపై అత్యాచారం చేశాడని యువతి ఆరోపించింది.
 
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నకిలీ బాబా పరారీలో ఉన్నట్లు సమాచారం. బాబా కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.