శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 29 ఆగస్టు 2023 (14:30 IST)

ప్యామిలీ సెలూన్ ముసుగులో వ్యభిచారం.. రెండు స్పా సెంటర్లు సీజ్

massage
హైదరాబాద్ నగరంలో ఫ్యామిలీ సెలూన్ స్పా ముసుగులో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తుండటాన్ని పోలీసులు గుర్తించారు. నగరంలోని బంజారాహిల్స్‌లో ఉన్న పలు స్పా కేంద్రాల్లో వ్యభిచారం జరుగుతున్నట్టు పోలీసులకు పక్కా సమాచారం వచ్చింది. దీంతో ప్రత్యేక బృందం పోలీసులు పలు స్పా కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న రెండు స్పా సెంటర్లను గుర్తించి వాటిని సీజ్ చేశారు. అలాగే, ఈ స్పా కేంద్రాల్లో పని చేస్తున్న 17 మంది యువతులను రక్షించి ప్రభుత్వ హోంకు తరలించారు. నిర్వాహకులు, విటులను పోలీసులు అరెస్టు చేశారు.
 
అమాయక యువతులే టార్గెట్‌గా డబ్బు ఆశ చూపి ఈ దందాను నిర్వహిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. మసాజ్ థెరపిస్టులు, బ్యూటీషియన్లు పేరుతో వివిధ ప్రాంతాల నుంచి యువతులను రప్పించి, వారికి పెద్ద మొత్తంలో డబ్బు ఆశ చూపి వ్యభిచారరొంపిలోకి దించుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ దందాపై వచ్చిన పక్కా సమాచారంతో మంగళవారం దాడులు నిర్వహించగా, రెండు సెంటర్లలో వ్యభిచారం జరుగుతున్నట్టు గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. 
 
బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో ఫ్యామిలీ సెలూన్ ముసుగులో వ్యభిచారం జరుగుతుందని గుర్తించినట్టు స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్.ఐ ఎస్.కరుణాకర్ రెడ్డి తెలిపారు. పైగా, ఈ సెలూన్‌కు ఎలాంటి అనుమతులు లేవని చెప్పారు. సీసీటీవీ కెమెలారు కూడా ఏర్పాటు చేయలేదని చెప్పారు. పది మంది యువతులతో వ్యభిచారం చేయిస్తున్నట్టు గుర్తించినట్టు చెప్పారు. దీంతో సెలూన్ నిర్వాహకుడిపై ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.