సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 29 ఆగస్టు 2023 (13:43 IST)

శ్రావణ మాసం.. తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన బంగారం ధరలు

gold
తెలుగు రాష్ట్ర్రాల్లో బంగారం ధరలు తగ్గాయి. సోమవారంతో పోలిస్తే 10 గ్రాముల బంగారంపై రూ. 50 తగ్గింది. వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం శ్రావణ మాసం కావడంతో బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు మహిళలు ఎక్కువ ఆసక్తిచూపుతారు. 
 
దీనికితోడు పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం దుకాణాలు రద్దీగా మారాయి. తాజాగా తగ్గిన బంగారం ధరలతో కొనుగోలుదారులకు కాస్త ఊరట లభిస్తుంది. 
 
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం ప్రాంతాల్లో 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,450 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 59,400 వద్ద కొనసాగుతోంది.