సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 28 ఆగస్టు 2023 (10:43 IST)

తెలంగాణాలో కాంగ్రెస్ రెపరెపలు - ఇండియా టుడే - సీ ఓటర్ సర్వే

congress flag
వచ్చే యేడాది లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని ఇండియా టుడే సీఓటర్ సంస్థ నిర్వహించిన తాజా సర్వేలో వెల్లడైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో వైకాపాకు ఓటమి తప్పదని ఈ సర్వే హెచ్చరించింది. తాజాగా తెలంగాణా రాష్ట్రంలో జరిగిన సర్వే ఫలితాలను వెల్లడించింది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగినప్పటికీ చివరకు కాంగ్రెస్ పైచేయి అవుతుందని తెలిపింది. 
 
మూడ్ ఆఫ్ నేషన్ పేరుతో నిర్వహించిన ఈ సంస్థ వెల్లడించిన సర్వే ప్రకారం.. తెలంగాణలోని 17 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి 7, బీఆర్ఎస్‌కు 5, బీజేపీకి 4. మజ్లిస్ పార్టీకి 1 సీటు దక్కనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ భాగస్వామిగా ఉన్న ఇండియా కూటమికి ఆంధ్రప్రదేశ్‌ కేవలం 2 శాతం ఓట్లే లభించినప్పటికీ తెలంగాణలో 98 శాతం ఓట్లు లభిస్తాయని సర్వేలో వెల్లడైంది.
 
బీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్ పార్టీకి కంటే 6 శాతం తక్కువగా 32 శాతం ఓట్లు. ఐదు సీట్లు లభిస్తాయని తెలిసింది. అలాగని బీజేపీని కూడా తక్కువ అంచనా వేయక్కర్లేదని.. ఆ పార్టీకి 23 శాతం ఓట్లతో 4 సీట్లు లభిస్తాయని సర్వేలో వెల్లడైంది. 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు 41.71 శాతం ఓట్లు రాగా 2024 నాటికి ఈ ఓట్లు దాదాపు పది శాతం తగ్గనున్నట్లు ఈ సర్వే అంచనా వేసింది. అదేసమయంలో కాంగ్రెస్ ఓట్ల శాతం 29.79 శాతం నుంచి 98 శాతానికి పెరగనున్నట్టు అంచనా వేయడం గమనార్హం. 
 
బీజేపీకి 2019లో 19.65 శాతం ఓట్లు రాగా. ఈసారి ఆ పార్టీ ఓట్లు దాదాపు నాలుగు శాతం మేర పెరుగుతాయని అంచనా. ఈ మూడు పార్టీల్లో బీఆర్ఎస్ తప్ప మిగతా రెండు పార్టీల ఓట్ల శాతం పెరగడం.. గులాబీ పార్టీకి ప్రజాబలం తగ్గుతున్నదనడానికి సంకేతంగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. సార్వత్రిక ఎన్ని కలు మరో 8 నెలలు ఉండగానే ఈ పరిస్థితి ఉందంటే.. 2024 ఏప్రిల్, మే నాటికి పరిస్థితిలో మార్పు వచ్చి బీఆర్ఎస్ ఓట్ల శాతం మరింత తగ్గిపోయి, కాంగ్రెస్ మరింత పుంజుకునే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు భావిస్తున్నారు.