శనివారం, 1 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 15 ఆగస్టు 2023 (20:13 IST)

సినిమా ఛాన్స్ ఇప్పిస్తామని చెప్పి మోసం.. యువతి ఆత్మహత్య

suicide
సినిమా ఛాన్స్ ఇప్పిస్తామని చెప్పి ఓ వ్యక్తి చేతిలో మోసపోయిన యువతి ఆత్మహత్యకు పాల్పడింది. సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. ఓ వెలుగు వెలిగిపోదామనుకున్న ఆ యువతి మోసపోయానని తెలిసి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. ఆఫర్లు ఇప్పిస్తాడన్న నమ్మకంతో అతనికి సర్వం అప్పగించింది బిందు. చిన్నప్పటి నుంచి నటన అంటే ఎంతో మక్కువ చూపించేది. దీంతో హీరోయిన్ అయిపోదామనుకుని హైదరాబాదులో ఛాన్సుల కోసం వెతికింది. ఈ క్రమంలో ఆమెకు పూర్ణచందర్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. తనకు ఇండస్ట్రీ పెద్దలతో బాగా పరిచయాలు ఉన్నాయని.. ఆఫర్లు ఇప్పిస్తానని నమ్మించాడు. 
 
తనను నమ్ముకుంటే ఇండస్ట్రీలో హీరోయిన్ ఛాన్స్ ఇప్పిస్తానని బిందుని లొంగదీసుకున్నాడు. తన జీవిత ఆశయం నెరవేరబోతుందని ఆనందంతో తన సర్వస్వాన్ని అప్పగించింది బిందు. అంతేకాదు అతనితో సహజీవనం చేసింది. 
 
కొద్దిరోజుల తర్వాత పూర్ణచందర్ మరో యువతితో తిరగడం మొదలు పెట్టాడు.. దీంతో తాను దారుణంగా మోసపోయానని బాధతోనే రాయదుర్గంలోని 21 అంతస్తు భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పపడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.