సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 15 ఆగస్టు 2023 (20:06 IST)

సీఎం తీపి కబురు- నేటి నుంచే డబుల్ బెడ్‌ రూమ్ ఇళ్ల పంపిణీ

kcrcm
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ తీపి కబురు చెప్పారు. ఆగస్టు 15 నుంచే లక్ష డబుల్ బెడ్‌ రూం ఇళ్ల పంపిణీ వుంటుందని తెలిపారు. ఇందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లను లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. నియోజవర్గానికి 4 వేల చొప్పున లక్ష ఇళ్ల పంపిణీ చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. 
 
గోల్కొండ కోట‌పై జాతీయ జెండాను ఎగుర‌వేసిన అనంత‌రం ప్రజలనుద్దేశించిన ప్రసంగించిన కేసీఆర్.. హైదరాబాద్ మహానగరంలో నిర్మాణం పూర్తిచేసుకొని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రభుత్వం నేటినుంచే అర్హులైన పేదలకు అందజేస్తుందని చెప్పారు. 
 
ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించి గృహలక్ష్మి పథకంలో దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించిందని తెలిపారు. నేత కార్మికుల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం వారికోసం అనేక సంక్షేమ పథకాలను అమల్లోకి తెచ్చిందని కేసీఆర్ గుర్తు చేశారు.