మహేష్ బాబు బర్త్ డే గిఫ్ట్ 'ఆగడు' టీజర్: డిక్కీ బలిసిన కోడి చికెన్ షాపుకొచ్చి...!

mahesh babu
Selvi| Last Updated: శనివారం, 9 ఆగస్టు 2014 (17:18 IST)
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు వేడుకలను ఆయన అభిమానులు శనివారం ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ బర్త్ డే వేడుకలను పురస్కరించుకుని మహేష్ బాబు తాజా చిత్రం 'ఆగడు' టీజర్‌ను విడుదల చేశారు.

"డిక్కీ బలిసిన కోడి చికెన్ షాపు ముందుకొచ్చి తొడ కొట్టిందట... అయినా నువ్వు డైలాగ్ వేస్తే కౌంటర్ ఇవ్వడానికి నేనేమైనా రైటర్నా... ఫైటర్ని" అంటూ తనదైన శైలిలో మహేష్ బాబు చెప్పిన డైలాగుతో ‘ఆగడు’ టీజర్ సామాజిక మాధ్యమాల్లో విశేష ఆదరణ పొందుతోంది.

రెండు రోజుల క్రితం రాం చరణ్ తాజా చిత్రం గోవిందుడు అందరివాడేలే చిత్రం టీజర్‌ను విడుదల చేయగా, ఇపుడు మహేష్ బాబు ఆగడు టీజర్‌ను విడుదల చేశారు. గోవిందుడు అందరివాడేలే చిత్రానికి కృష్ణవంశీ దర్శకత్వం వహించగా, ఆగడుకు శ్రీనువైట్ల దర్శకత్వ వహించారు.దీనిపై మరింత చదవండి :