1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT

అమల-నాగ్-టబులపై ట్రయాంగిల్ స్టోరీ రెడీ

నిన్నేపెళ్లాడుతా... చిత్రంలో పర్‌ఫెక్ట్ కపుల్‌గా నటించి ప్రేక్షకుల మదిలో తమదైన ముద్ర వేసుకున్న జంట నాగార్జున, టబు. వీళ్లద్దరి మధ్య ఏదో ఉందని టాలీవుడ్ సినీజనం అప్పుడప్పుడు గుసగుసలు పోతుంటారు. దీనికితోడు టబు ఏకంగా తన మకాన్ని హైదరాబాదుకు మార్చేయడంతోపాటు వివాహం ఊసే ఎత్తకపోవడంతో సినీ జనాలు లేవనెత్తుతున్న సందేహాలు నిజమేనేమోనన్న అనుమానం కలుగుక మానదు.

అయితే యువసామ్రాట్ నాగార్జున మాత్రం టబు తనకు మంచి స్నేహితురాలని చెపుతారు. అదేవిధంగా నాగార్జున భార్య అమల సైతం నాగార్జునకంటే టబు తనకు మరింత సన్నిహిత స్నేహితురాలని చెపుతుంటారు. అయితే ఫిలిమ్ జనం మాత్రం నాగార్జున-టబుల మధ్య చిగురించిన స్నేహబంధం చాలా బలమైన బంధంగా మారిపోయిందని సందర్భం వచ్చినపుడల్లా చెపుతుంటారు.

ఈ సంగతి ఇలావుంటే, వీరి ముగ్గురి మధ్య ఉన్న సంబంధాలను ఇతివృత్తంగా చేసుకుని ఓ బాలీవుడ్ నిర్మాత చిత్రాన్ని నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నాడట. కథ కూడా సిద్ధమైపోయిందట. ఈ చిత్రంలో హీరో ఓ పాపులర్ స్టార్‌గా ఉంటాడట. అతని భార్య కూడా నటీమణే. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్న తర్వాత మధ్యలో హీరోగారి జీవితంలోకి మరో తార ప్రవేశిస్తుందట. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు ఏమిటి..? అనేది మిగిలిన సినిమా అని సదరు నిర్మాత చెప్పుకొస్తున్నాడట. ఈ సినిమా తెరకెక్కితే గానీ అసలు సంగతి తెలియదు...