సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 16 ఏప్రియల్ 2020 (16:55 IST)

నా రేంజ్‌కు తగినంతగా ఇస్తేనే నటిస్తానంటున్న సీనియర్ నటి!

తెలుగు చిత్రపరిశ్రమలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేసుకున్న హీరోయిన్లలో రమ్యకృష్ణ ఒకరు. ప్రస్తుతం ఈమె కీలక పాత్రలను పోషిస్తూ ప్రతి ఒక్కరినీ మెప్పిస్తున్నారు. 
 
అయితే, ఈమె యువ హీరో నితిన్ నటించనున్న చిత్రంలో నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయట. ఆ చిత్రం పేరు "అంధాదున్". ఇది రీమేక్ చిత్రం. ఇందులో నితిన్ నటించనున్నారు. 
 
తాజా సమాచారం మేరకు.. "అంధాదున్" అనే చిత్రంలో మరో సీనియర్ నటి టుబు పోషించిన పాత్ర కోసం చిత్ర యూనిట్ రమ్యకృష్ణను సంప్రదించారట. అయితే, ఆమె భారీ మొత్తంలో రెమ్యునషన్ డిమాండ్ చేసిందట. కాగా, "భీష్మ" పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నితిన్.. ఈ చిత్రం విజయంతో మంచి ఊపులో ఉన్నారు.