శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: బుధవారం, 15 ఏప్రియల్ 2020 (18:38 IST)

బుల్లితెర యాంకర్‌తో యువహీరో క్లోజ్‌గా?

ఈ మధ్యకాలంలో ఓ టాలీవుడ్ యువ హీరో ఒక బుల్లితెర యాంకర్‌తో పీకల్లోతు ప్రేమలో ఉన్నారన్న ప్రచారం బాగానే సాగుతోంది. అటు తెలుగు సినీపరిశ్రమలోను, ఇటు బుల్లితెర నటుల మధ్య ఈ చర్చ ఇప్పుడు నడుస్తోంది. అయితే ఆ యాంకర్ ఎవరో కాదు పొగుడు కాళ్ళ సుందరి విష్ణుప్రియ. అదేనండి పోవే పోరా సీరియల్‌లో యాంకర్ ఈమె.
 
విష్ణుప్రియకు యాంకర్‌గా మంచి పేరే ఉంది. అయితే ఈ మధ్య ఆమె ఓ యువహీరోతో కలిసి తిరుగుతోందట. ఈ విషయాన్ని విష్ణుప్రియనే స్వయంగా చెప్పింది. సదరు యంగ్ హీరోతో తన స్నేహం కొనసాగుతోందని ఆమె చెప్పడంతో ఒక్కసారిగా చర్చ ప్రారంభమైంది. 
 
అయితే కొంతమంది ఇదంతా ఆమె సినిమా అవకాశాల కోసం ఇలా చెబుతోందని అంటుంటే.. మరికొందరు మాత్రం అది నిజమేనని తేల్చేస్తున్నారు. కానీ సదరు యువ హీరో మాత్రం ఈ విషయంపై ఇప్పటి వరకు స్పందించలేదు.