సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 6 ఏప్రియల్ 2020 (16:08 IST)

రాజీవ్ కనకాల సోదరి.. సుమ వదినమ్మ శ్రీలక్ష్మి కన్నుమూత

యాంకర్ సుమ భర్త రాజీవ్ కనకాల సోదరి శ్రీలక్ష్మి సోమవారం మధ్యాహ్నం కన్ను మూశారు. దీంతో సుమ ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని సుమ కుటుంబీకులు తెలిపారు. ప్రముఖ నటుడు, దర్శకుడు దేవదాసు కనకాల ఇద్దరి సంతానంలో రాజీవ్ కనకాల ఒకరు కాగా శ్రీలక్ష్మి మరొకరు.

శ్రీలక్ష్మి భర్త ప్రముఖ పాత్రికేయుడు పెద్ద రామారావు. శ్రీలక్ష్మి, పెద్ద రామారావు దంపతులకు ఇద్దరు అమ్మాయిలున్నారు. శ్రీలక్ష్మి మరణ వార్త తెలిసిన వెంటనే సుమ, రాజీవ్ కనకాల బంధువులు, వారి సన్నిహితులు పెద్ద సంఖ్యలో వారింటికి చేరుకున్నారు.
 
ఇకపోతే.. శ్రీలక్ష్మి కనకాల దూరదర్శన్‌లో వచ్చిన రాజశేఖర చరితము సీరియల్ ద్వారా నటనారంగంలోకి అడుగుపెట్టారు. పలు సీరియళ్ళలో నటించారు. తన తండ్రి దేవదాస్ కనకాల దర్శకత్వంలో పలు సీరియళ్ళలోను, టెలిఫిల్మ్స్‌లోను శ్రీలక్ష్మి నటించారు.

తెలుగుతోపాటు కన్నడ, హిందీ సీరియళ్ళలోను ఆమె నటించి తన ప్రతిభను చాటుకున్నారు. కానీ అనారోగ్యం కారణంగా ఆమె ప్రాణాలు కోల్పోవడంతో సినీ ప్రముఖులు రాజీవ్ కనకాల, సుమ కుటుంబానికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.