శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 16 ఏప్రియల్ 2020 (16:43 IST)

దర్శకత్వానికి స్వస్తి చెప్తానని అంటున్న డాషింగ్ డైరెక్టర్!

తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న డాషింగ్ డైరెక్టర్లలో కొరటాల శివ ఒకరు. ఆయన ఒక చిత్రం తీశారంటే అది సంచలన విజయం ఖాయం. అలాంటి సినిమాల్లో 'మిర్చి', 'శ్రీమంతుడు', 'జనతా గ్యారేజ్', 'భరత్' అనే నేను చిత్రాలు ఉన్నాయి. ప్రతి చిత్రంలోనూ సమాజానికి ఉపయోగపడేలా ఓ సందేశం. ఒక చిత్ర కథతో మరొకదానికి పోలిక లేకుండా అద్భుతంగా తెరక్కించారు. ఇపుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆచార్య అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో తన భవిష్యత్ ప్రణాళికపై ఆయన స్పందిస్తూ, అనుకోకుండా ఈ సినిమాకు మూడేళ్ల గ్యాప్ వచ్చేసింది. ఇకపై వేగంగా సినిమాలు చేయాలనుకుంటున్నా. నేను మహా అయితే మరో అయిదారేళ్లు ఇండస్ట్రీలో వుంటానేమో. ఈ లోపే నేను చేయాలనుకుంటున్న సినిమాలన్నింటినీ చేసెయ్యాలి. సమయం వృథాగా పోతుంటే బాధగా ఉందన్నారు. 
 
ఇకపోతే, 'ఆచార్య' సినిమాలో రాంచరణ్ ఉన్నాడని కన్ఫామ్ చేశారు. అతని పక్కన హీరోయిన్‌ను ఇంకా ఎంపిక చేయలేదని తెలిపారు. అయితే, ఈ చిత్ర కథ ఏ విధంగా ఉండబోతుందున్న విషయంపై ఆయన క్లారిటీ ఇచ్చేందుకు ససేమిరా అన్నారు.