సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 6 జనవరి 2023 (12:26 IST)

సమంత తాజా లుక్ అదుర్స్.. తెల్లటి స్లీవ్‌లెస్ షర్టు, ప్యాంట్‌

Samantha
Samantha
టాలీవుడ్ నటి సమంత శుక్రవారం ముంబై విమానాశ్రయంలో కనిపించారు. తాజా లుక్స్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.  
 
ఈ వీడియోలో సమంత తెల్లటి స్లీవ్‌లెస్ షర్టు, ప్యాంట్‌ను ధరించింది.  ఇంకా సమంత సన్ గ్లాసెస్ ధరించింది. ఆమె హ్యాండ్‌బ్యాగ్ పట్టుకుని జుట్టు వదులుగా ఉంచుకోవడం కనిపించింది. ఆమె అందమైన డ్రెస్‌ను ఫోటోగ్రాఫర్లు క్యాప్చర్ చేసి సోషల్ మీడియాలో పంచుకున్నారు.  
 
ఇకపోతే.. గుణ శేఖర్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న శాకుంతలం సినిమా  ఫిబ్రవర్‌ 17వ తేదీన విడుదల చేయనున్నారు. మహాభారతంలోని ఆదిపర్వంలో శకుంతల, దుష్యంతుల ప్రేమకథ ఆధారంగా ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో సామ్‌ శకుంతలగా నటిస్తుండగా, దుష్యంతుడిగా దేవ్‌ మోహన్‌ కనిపించనున్నారు.