సోమవారం, 2 అక్టోబరు 2023
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 3 జనవరి 2023 (19:52 IST)

ఫస్ట్ టీ20 మ్యాచ్ : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లంక జట్టు

team india
భారత్, శ్రీలంక జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ మంగళవారం నుంచి ప్రారంభమైంది. ఇందులోభాగంగా తొలి టీ20 మ్యాచ్ ముంబై వేదికగా వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఫలితంగా టీమిండియా బ్యాటింగ్‌కు చేపట్టింది. ఈ మ్యాచ్ ద్వారా శుభమాన్ గిల్, శివమ్ మావిలు తొలిసారి అంతర్జాతీయ టీ20ల్లో అరంగేట్రం చేస్తున్నారు. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని బారత జట్టు పర్యాటక లంక జట్టుతో తలపడుతుంది. 
 
ఈ మ్యాచ్ కోసం ప్రకటించిన ఇరు జట్ల వివరాలను పరిశీలిస్తే, 
భారత్ : హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, గిల్, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, దీపక్ హుడా, ఆక్షర్ పటేల్, హర్షల్ పటేల్, శివమ్ మావి, ఉమ్రాన్ మాలిక్ యజువేంద్ర చహల్.
 
శ్రీలంక జట్టు.,. 
దసున్ షనక, నిస్సాంక, కుశాల్ మెండీస్, ధనంజయ డిసిల్వా, చరిత్ర అసలంక, భానుక రాజపక్స, వనిందు హసరంగ, చామిక కరుణరత్నే, మహీశ్ తీక్షణ, కసున్ రజిత దిల్షాన్ మధుశంక.