శనివారం, 21 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 2 డిశెంబరు 2022 (10:23 IST)

ఆప్ఘనిస్థాన్‌పై శ్రీలంక గెలుపు.. వన్డే సిరీస్ సమం

Sri lanka
Sri lanka
శ్రీలంకలో పర్యటించిన ఆప్ఘనిస్థాన్ జట్టుకు ఓటమి తప్పలేదు. లంకేయులు మెరుగ్గా రాణించడంతో 1-1తో వన్డే సిరీస్ సమం అయ్యింది. మూడు మ్యాచ్‌ల సిరీస్ కోసం శ్రీలంకలో పర్యటించిన ఆప్ఘన్‌...ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో 60 పరుగుల తేడాతో గెలుపును నమోదుచేసుకుంది. 
 
వర్షం కారణంగా రెండో మ్యాచ్ ఫలితం తేలకుండా రద్దు అయ్యింది. నిర్ణయాత్మక మూడో వన్డేలో ఆతిథ్య జట్టు నాలుగు వికెట్ల తేడాతో ఓడించడంతో సిరీస్ సమంగా ముగిసింది. 
 
మూడో వన్డేలో టాస్ గెలిచిన ఆప్ఘనిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 313 పరుగుల భారీ స్కోర్ చేసింది. శ్రీలంక జట్టు అద్భుత ప్రదర్శనతో 49.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. 
 
శ్రీలంక ఆటగాళ్లలో సిరీస్ తొలి మ్యాచ్‌లో సెంచరీ సాధించిన ఇబ్రహీమ్ జద్రాన్... ఇదే మ్యాచ్‌లోనూ అద్భుత శతకాన్ని నమోదు చేసుకున్నాడు. 
 
ఇతను 138 బంతుల్లో 15 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 162 పరుగులు సాధించాడు. తద్వారా కేవలం 8 వన్డేల్లోనే 3 శతకాలు బాది జోరుమీదున్న 20 ఏళ్ల జద్రాన్‌.. ఆఫ్ఘన్‌ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరర్‌గా రికార్డుల్లోకెక్కాడు. దీంతో పాటు ఇబ్రహీమ్ జద్రాన్‌కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. చరిత్‌ (83)కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.