శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 29 జూన్ 2023 (17:17 IST)

స్టాలిన్ తర్వాత మళ్లీ జతకట్టనున్న చిరు-త్రిష?

chiru_Trisha
chiru_Trisha
స్టాలిన్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, గ్లామర్ క్వీన్ త్రిష జోడీ కట్టనున్నారు. బంగార్రాజు ఫేమ్ కల్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహించే ఈ చిత్రం కోసం నటీనటుల ఎంపిక జరుగుతోంది. తండ్రీ కొడుకుల నేపథ్యంలో ఈ సినిమా రూపొందనుందని టాక్. 
 
ఈ సినిమాలోనే చిరంజీవి భార్యగా త్రిషగా కనిపించనుందని తెలిసింది. త్వరలోనే అధికార ప్రకటన రానుంది. ఈ చిత్రంలో యంగ్ హీరో డీజె టిల్లు ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ కూడా ఓ కీలక పాత్ర పోషించనున్నారట. 
 
చిరంజీవి తనయ సుస్మిత కొణిదెల చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన ‘బ్రో డాడీ’కి రీమేక్‌గా ఈ మూవీ రూపొందనుందట.