శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: గురువారం, 21 డిశెంబరు 2017 (19:22 IST)

చెర్రీకి లిప్ కిస్ ఇవ్వను... తేల్చి చెప్పిన అక్కినేని సమంత

సమంత అక్కినేని వారి కోడలయ్యాక ఆమె చాలావరకు మారిపోయిందనే చెప్పాలి. నిన్న రాత్రి హలో చిత్రం ప్రి-రిలీజ్ ఫంక్షనుకి పూర్తిగా వస్త్రధారణ చేసుకున్న దుస్తులతో వచ్చింది. సహజంగా కాస్త గ్లామర్ దుస్తులను ధరించి వస్తుండేది. కానీ ఆ పద్ధతి మార్చేసుకుంది. ఇకపోతే తా

సమంత అక్కినేని వారి కోడలయ్యాక ఆమె చాలావరకు మారిపోయిందనే చెప్పాలి. నిన్న రాత్రి హలో చిత్రం ప్రి-రిలీజ్ ఫంక్షనుకి పూర్తిగా వస్త్రధారణ చేసుకున్న దుస్తులతో వచ్చింది. సహజంగా కాస్త గ్లామర్ దుస్తులను ధరించి వస్తుండేది. కానీ ఆ పద్ధతి మార్చేసుకుంది. ఇకపోతే తాజాగా మరో వార్త బయటకు వచ్చింది. 
 
రామ్ చరణ్ హీరోగా సమంత హీరోయిన్‌గా రంగస్థలం చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో చెర్రీతో సమంత ఘాటు రొమాంటిక్ కిస్ ఒకటి వుందట. లిప్ టు లిప్ కిస్ కథలో కీలకమైనదట. కానీ అలాంటి సీన్లో తను నటించనని ముఖం మీదే తేల్చి చెప్పిందట సమంత.
 
సమంత ఇలా చెప్పిందని తెలియడంతో అక్కినేని ఫ్యాన్స్ చాలా హేపీగా ఫీలవుతున్నారు. కాగా సమంత రంగస్థలం, మహానటి చిత్రాల్లో నటిస్తోంది. ఈ రెండు చిత్రాల్లో రంగస్థలం చిత్రంలోనే గ్లామర్ నటనకు అవకాశం వుంది. మహానటితో పెద్దగా ఇబ్బందిలేదు. మరి ఆ తదుపరి చిత్రాల్లో నటిస్తుందో లేదంటే అక్కినేని కోడలిగా అమల చాటు కోడలిగా వుండిపోతుందో చూడాలి.