మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 16 డిశెంబరు 2017 (15:50 IST)

మహానటిలో భాగమైనందుకు హ్యాపీ.. లూనా నా వద్దకొచ్చింది: సమంత

టాలీవుడ్ అగ్ర హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా వున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో సమంతకు మంచి ఫాలోయింగ్ వుంది. ప్రస్తుతం ట్విట్టర్లో సమంతకు 5.6 మిలియన్ల ఫాలోవర్లున్నారు. తద్వారా దక్షిణ

టాలీవుడ్ అగ్ర హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా వున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో సమంతకు మంచి ఫాలోయింగ్ వుంది. ప్రస్తుతం ట్విట్టర్లో సమంతకు 5.6 మిలియన్ల ఫాలోవర్లున్నారు. తద్వారా దక్షిణాది సినీ ఇండస్ట్రీకి చెందిన హీరో ధనుష్ తర్వాత సమంతకే ఎక్కువమంది ఫాలోవర్లుండడం విశేషం. అంతేకాకుండా.. సమంత భర్త చైతూ సమంతకు దరిదాపుల్లో కూడా లేకపోవడం గమనార్హం. 
 
తాజాగా తన కొత్త బండి గురించి సమంత సోషల్ మీడియాలో చెప్పుకొచ్చింది. ఇంతకు సమంత దగ్గరున్న కొత్త బండి ఏంటంటే ''లూనా''. 1980 కాలంలో ఈ బండిని వాడారు. ప్రస్తుతం సావిత్రి సినిమా కథతో తెరకెక్కుతున్న మహానటి కోసం ఈ లూనాను సినీ యూనిట్ తయారుచేయించింది.
 
దానిని సమంత సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 1980కి వెళ్తున్నాం.. కొందరి జీవిత చరిత్రలు అందరూ తెలుసుకోవాల్సి వుంది. ముఖ్యంగా సావిత్రి జీవితకథ మహానటిలో భాగమైనందుకు సంతోషంగా వుందని కామెంట్ చేసింది.