మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 5 మార్చి 2021 (17:01 IST)

దక్షిణాది రాధికా ఆప్టేగా అమలాపాల్.. ఆ రోల్స్‌కు గ్రీన్ సిగ్నల్?!

డేరింగ్ రోల్స్ చేసేందుకు తాను సిద్ధంగా వున్నానని అమలా పాల్ అంటోంది. ఇద్దరమ్మాయిలతో తెలుగు తెరకు పరిచయమైన ఈ నల్లపిల్ల అమలాపాల్ ఆపై కొన్ని సినిమాల్లో కనిపించినా ఆశించిన స్థాయిలో రాణించలేదు. తమిళంలో మోస్తరు మార్కులు వేసుకుని ఆఫర్లతో ముందుకెళ్తుంది. 
 
ప్రేమించి వివాహం చేసుకున్న దర్శకుడు విజయ్ నుంచి దూరమయ్యాక సినిమాల్లో రాణిస్తోంది. తాజాగా పిట్టకథలు సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది అమలాపాల్. ఈ బ్యూటీ నటించిన పాత్రకు మంచి ప్రశంసలు అందుకుంది.  రాబోయే కాలంలో తనకు అలాంటి మరిన్ని బోల్డ్ కథాంశాల్లో నటించే ఛాన్స్ రావాలని ఎదురుచూస్తుందట. 
 
అంతేకాదు ఈ భామ లిప్ టు లిప్ కిస్ సీన్లకు కూడా పచ్చజెండా ఊపిందన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. గ్లోబల్ ఆడియెన్స్, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు కనెక్ట్ అయ్యేలా మరిన్ని వెబ్ డ్రామాలు, ఓటీటీ షోలు చేయాలనుకుంటుందట అమలాపాల్‌. 
 
దక్షిణాది రాధికాఆప్టేగా పేరు తెచ్చుకోవాలని కంకణం కట్టుకున్న అమలాపాల్‌కు ఫిల్మ్ మేకర్స్ ఆఫర్స్ ఇస్తారా అన్నది కాలమే నిర్ణయిస్తుంది. ఆసక్తికర విషమేంటంటే తన బేస్‌ను చెన్నై నుంచి హైదరాబాద్‌కు మార్చాలనే యోచనలో అమలాపాల్ ఉన్నట్టు తెలుస్తోంది.