సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 1 మార్చి 2021 (18:48 IST)

ఛీ.. మహా చెడ్డ ఇండస్ట్రీ... కష్టాల్లో ఉంటే ఒక్కరూ పలుకరించలేదు...

దర్శకుడు ఏఎల్.విజయ్‌ను పెళ్లాడిన హీరోయిన్ అమలాపాల్.. కేవలం ఒక యేడాదిలోనే తెగదెంపులు చేసుకుంది. ఆ తర్వాత ఆమె ఒంటరి జీవితాన్ని గడుపుతోంది. ఈ క్రమంలో ఆమె నందినీ రెడ్డి దర్శకత్వంలో నటించిన పిట్ట‌క‌థ‌లు చిత్రం విడుదలైంది. 
 
ఈ వివాహ బంధంలో ఉన్న‌పుడు తనను చెడ్డ మ‌హిళ‌గా చూపిస్తుండ‌టంతో మాన‌సికంగా చాలా ఒత్తిడికి లోనయ్యాన‌ని చెప్పింది. క్లిష్ట ప‌రిస్థితుల్లో సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన‌వారెవ‌రూ నాకు మ‌ద్ద‌తు తెల‌ప‌లేదు. నేను ఒంటరిగానే పోరాటం చేసుకొచ్చాన‌ని చెప్పింది అమ‌లాపాల్‌. ప్ర‌స్తుతం త‌మిళంలో రెండు, మ‌ల‌యాళంలో రెండు సినిమాల‌తో బిజీగా ఉంది. 
 
ఏ.ఎల్.విజ‌య్‌తో విడాకుల త‌ర్వాత బాలీవుడ్‌ గాయకుడు భవీందర్‌సింగ్‌తో ప్రేమలో ప‌డింది. ఆ మ‌ధ్య‌ ప్రియుడు భ‌వీంద‌ర్ సింగ్‌తో కలిసి ఓ వెడ్డింగ్‌ ఫొటోషూట్‌లో కూడా పాల్గొన‌డంతో.. వీరిద్దరికి పెళ్లయిపోయిందనే వార్తలు చ‌క్క‌ర్లు కొట్టాయి. 
 
అయితే కమర్షియల్‌ యాడ్‌లో భాగంగా వారిద్ద‌రు ఫొటో షూట్ చేసిన‌ట్టు క్లారిటీ ఇచ్చింది అమ‌లాపాల్‌. అయితే భ‌వీంద‌ర్ సింగ్‌తో కూడా అమలా‌పాల్‌కు బ్రేక‌ప్ అయింది. ప్ర‌స్తుతం వీరిద్ద‌‌రు దూరంగా ఉంటున్నారు. అమలాపాల్‌ పర్సనల్‌ ఫొటోలను భ‌వీంద‌ర్  సోషల్‌ మీడియాలో పోస్ట్ చేస్తుండటంతో.. ఆగ్రహించిన అమ‌లాపాల్ భ‌వీంద‌ర్‌పై పరువు నష్టం దావా వేసింది.