శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 30 సెప్టెంబరు 2022 (11:18 IST)

పాక్ యువ నటుడుతో పవన్ కళ్యాణ్ హీరోయిన్ డేటింగ్ నిజమేనా?

ameesha patel
పాకిస్థాన్ యువ నటుడు ఇమ్రాన్ అబ్బాస్‌తో తాను డేటింగ్ కొనసాగిస్తున్నట్టు వస్తున్న వార్తలపై బాలీవుడ్ నటి అమీషా పటేల్ స్పందించారు. ఈ డేటింగ్ వార్తలను ఇష్టానుసారంగా రాస్తున్నారంటూ వాపోయింది.

దీనిపై ఆమె స్పందిస్తూ, ఇమ్రాన్ అబ్బాస్ తనకు మంచి స్నేహితుడని చెప్పారు. అతనితో డేటింగ్‌ చేస్తున్నట్టు వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. ఇవన్నీ ఒట్టి పుకార్లేనని చెప్పారు.

ఇమ్రాన్ తనకు మంచి మిత్రుడని, అతడిని చాలా రోజుల తర్వాత కలిసినట్టు చెప్పారు. దాంతో ఇష్టం వచ్చినట్టుగా ప్రచారం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

కాగా, తెలుగులో పవన్ కళ్యాణ్ నటించిన "బద్రి" చిత్రంలో తళుక్కున మెరిసిన ఈ బాలీవుడ్ భామ... ఇప్పటికే బ్యాచిలర్ జీవితాన్నే అనుభవిస్తున్నారు.

ఈ క్రమంలో పాక్ యువ నటుడును ఈ ముదురుభామ కలుసుకోవడం, అతనితో కలిసి ఓ పాటకు అభినయం చేసినట్టుగా ఓ వార్తల వైరల్ అవుతోంది. దీనిపై ఆమె క్లారిటీ ఇచ్చారు.