గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 1 సెప్టెంబరు 2022 (09:18 IST)

రెండున్నర కోట్లు నొక్కేసింది.. అమీషా పటేల్‌పై కేసు.. సుప్రీం స్టే

Ameesha Patel
బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్ చిక్కుల్లో చిక్కుకుంది. హృతిక్ కహోనా ప్యార్ హైతో బీటౌన్‌లో హీరోయిన్‌గా పాగా వేసిన ఈ బ్యూటీ… ఇప్పుడో ఆరోపణ ఎదుర్కొంటున్నారు. అప్పనంగా.. రెండున్నర కోట్లు నొక్కేసిదంటూ.. ఓ ప్రొడ్యూసర్ తన వ్యాఖ్యలతో అందర్నీ షాక్ చేస్తున్నారు.
 
అజయ్ కుమార్ అనే బాలీవుడ్ ప్రొడ్యూసర్… అమీషా పటేల్‌తో దేశీ మ్యూజిక్ అనే చేయాలనుకున్నారు. అడ్వాన్స్‌‌గా రెండున్నర కోట్లు ఇచ్చారట. కాని కొన్ని కారణాల ఆ పని చేయని అమీషా.. ఇచ్చిన అడ్వాన్స్‌ను కూడా తిరిగి ఇవ్వకుండా ముఖం చాటేశారట. దీంతో ఫీలైన ఆ ప్రొడ్యూసర్ అప్పట్లోనే ఈమెపై చీటింగ్‌ కేసు పెట్టారు. 
 
దీన్ని విచారించిన జార్ఖండ్‌ ట్రయల్ కోర్టు అమీషాపై మోసం, నమ్మక ద్రోహం సెక్షన్ల కింద సమన్లు జారీ చేసింది. దీంతో ఈ హీరోయిన్ సుప్రీం గడపతొక్కింది. దీంతో సుప్రీం సెక్షన్ 138 ప్రకారం ప్రొసీడింగ్స్ జరపాలని పోలీసును ఆదేశించింది. తీర్పు వాయిదా వేసింది.