గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 29 సెప్టెంబరు 2022 (19:24 IST)

పుష్ప-1లో సమంత.. పుష్ప-2లో కాజల్ అగర్వాల్.. ఐటమ్ సాంగ్ చేస్తుందా? (video)

Samantha_kajal
Samantha_kajal
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పుష్ప-2 తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సుక్కు దర్శకుడు. ఈ మూవీలో కాజల్ నటిస్తున్నారంటూ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇండియన్2 సినిమాతో కాజల్ అగర్వాల్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. 
 
ఈ సినిమాతో పాటు మరికొన్ని ప్రాజెక్ట్ లతో కూడా బిజీ కావాలని ఈ స్టార్ హీరోయిన్ భావిస్తున్నారు. పుష్ప2 సినిమాలో కాజల్ నటిస్తే మాత్రం ఈ సినిమా ఆమె కెరీర్‌కు కచ్చితంగా ప్లస్ అవుతుందని చెప్తున్నారు. పుష్ప2 సినిమాలో కాజల్ ఐటం సాంగ్ చేయడంతో పాటు కొన్ని సీన్లలో కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది.
 
పుష్ప1 సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ చేయగా ఆ సాంగ్ సినిమాకు హైలెట్‌గా నిలవడంతో పాటు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.