శుక్రవారం, 18 జులై 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By chitra
Last Updated : బుధవారం, 14 సెప్టెంబరు 2016 (16:01 IST)

బుల్లితెర సీరియల్‌లో అమితాబ్... కేదర్‌నాథ్ ఆలయ ప్రత్యేకతే ప్రధానాంశంగా సీరియల్

వెండితెరపైనే కాదు బుల్లితెరపై కూడా బిగ్ బి అమితాబ్ బచ్చన్ సూపర్ స్టారే. అందులో సందేహమే లేదు. 'కౌన్ బనేగా కరోర్ పతి' కార్యక్రమాన్ని నిర్వహించి, విజయవంతం చేసిన తీరు దేశవ్యాప్తంగా ఆయనకు విశేష ప్రజాదరణ సం

వెండితెరపైనే కాదు బుల్లితెరపై కూడా బిగ్ బి అమితాబ్ బచ్చన్ సూపర్ స్టారే. అందులో సందేహమే లేదు. 'కౌన్ బనేగా కరోర్ పతి' కార్యక్రమాన్ని నిర్వహించి, విజయవంతం చేసిన తీరు దేశవ్యాప్తంగా ఆయనకు విశేష ప్రజాదరణ సంపాదించి పెట్టింది. 
 
ఇప్పుడు మరోసారి బిగ్ బి బుల్లితెరపై కనిపించనున్నారు. అయితే ఈసారి ఏకంగా సీరియల్లో నటించేందుకు బాలీవుడ్ దిగ్గజం ఓకే చెప్పాడట. అమితాబ్ అభిమానులకు ఇది నిజంగా తియ్యటి కబురే! ఎందుకంటే, 'కౌన్ బనేగా..' కార్యక్రమం వారానికి ఒక్కసారే వస్తుంది. ఇప్పుడు అమితాబ్ సీరియల్లో నటిస్తుండడం నిజంగా అభిమానులకు పండగే. 
 
కేదర్‌నాథ్‌ ఆలయం నేపథ్యంలో ఈ సీరియల్‌ను తెరకెక్కిస్తున్నారు. ''బాబా కేదర్''’ టైటిల్‌తో రానున్న ఈ సీరియల్‌లో అమితాబ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సీరియల్‌లో ఆయనతో పాటు హేమమాలినీ, సోనూ నిగమ్‌, శ్రేయా ఘోషల్‌, కైలాశ్‌ ఖేర్‌లు కూడా నటిస్తున్నారు. 
 
మొత్తం 12 ఎపిసోడ్లుగా ఈ సీరియల్ ప్రసారం కానుంది. పవిత్ర శివక్షేత్రమైన కేదర్‌నాథ్‌ ప్రత్యేకతలను ప్రజలకు తెలియజేయాలని ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం ఈ సీరియల్‌ను నిర్మిస్తుడడం విశేషం. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఈ సీరియల్ త్వరలోనే వీక్షకుల ముందుకు రానుంది.