ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 15 సెప్టెంబరు 2023 (21:32 IST)

అల్లు అర్జున్-అనిరుధ్- త్రివిక్రమ్.. బంపర్ హిట్ ఖాయమా?

Bunny_Allu Arjun
Bunny_Allu Arjun
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్- త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో యంగ్ సెన్సేషనల్ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. దీంతో థమన్- త్రివిక్రమ్ సంగీత కాంబోకు ఎండ్ కార్డు పడనున్నట్లు సినీ జనం అంటున్నారు. 
 
ఇప్పటికే "గుంటూరు కారం" కోసం థమన్ ఎంపికను మహేష్ బాబు నో చెప్పినట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. అయితే త్రివిక్రమ్ సూపర్ స్టార్‌ని ఒప్పించాడు తెలుస్తోంది. తాజాగా త్రివిక్రమ్- అనిరుధ్ రవిచంద్రన్ కాంబో మళ్లీ తెరకెక్కనుంది.

అల్లు అర్జున్ సినిమా కోసం అనిరుధ్‌తో మరోసారి కలిసి పని చేయనున్నారు త్రివిక్రమ్. 2024లో త్రివిక్రమ్, అల్లు అర్జున్ కొత్త సినిమా కోసం కలిసి పని చేయనున్నారు. అనిరుధ్ రవిచందర్ బృందంలో చేరాలని అల్లు అర్జున్ త్రివిక్రమ్‌కు సూచించినట్లు తెలిసింది. 
Allu Arjun_Anirudh
Allu Arjun_Anirudh
 
 షారుఖ్ ఖాన్ జవాన్ మొత్తం టీమ్‌ను బన్నీ అభినందించాడు. అలాగే బాలీవుడ్‌లో భారీ విజయాన్ని సాధించినందుకు అనిరుధ్ రవిచందర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ పోస్టుకు అనిరుధ్‌ సోషల్ మీడియాలో అల్లు అర్జున్‌కి కృతజ్ఞతలు తెలిపినప్పుడు, బన్నీ తనకు కృతజ్ఞతలు మాత్రమే కాదు, అద్భుతమైన పాటలు కావాలి అని బదులిచ్చారు. 
Anirudh
Anirudh
 
ప్రస్తుతం బన్నీ విజ్ఞప్తి మేరకు త్రివిక్రమ్ సినిమాలో అనిరుధ్‌కు అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. ఏదైతేనేం అల్లు అర్జున్-అనిరుధ్- త్రివిక్రమ్ సినిమాలో పాటలు హిట్ కావడం ఖాయమనిపించేలా వుందని సినీ జనం అనుకుంటున్నారు.