సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By DV
Last Modified: శుక్రవారం, 20 జనవరి 2017 (21:20 IST)

ఆకట్టుకున్న అనుపమ... రామ్ చరణ్ సరసన ఛాన్స్...

'అ..ఆ..' సినిమాలో నితిన్‌, సమంతను పెళ్లి చేసుకున్నా.. ఆ తర్వాత విడాకులు తీసుకుని నాకోసం వస్తాడంటూ... అంతవరకు బతకాలంటే.. తినాలంటూ అన్నం తింటా అంటూ ఆ చిత్రంలో నటించి ఆకట్టుకున్న నటి అనుపమ పరమేశ్వరన్‌. ఈ మధ్యే తెలుగులోకి అడుగుపెట్టిన మలయాళం భామకు ప్రస్త

'అ..ఆ..' సినిమాలో నితిన్‌, సమంతను పెళ్లి చేసుకున్నా.. ఆ తర్వాత విడాకులు తీసుకుని నాకోసం వస్తాడంటూ... అంతవరకు బతకాలంటే.. తినాలంటూ అన్నం తింటా అంటూ ఆ చిత్రంలో నటించి ఆకట్టుకున్న నటి అనుపమ పరమేశ్వరన్‌. ఈ మధ్యే తెలుగులోకి అడుగుపెట్టిన మలయాళం భామకు ప్రస్తుతం ఆఫర్లు తన్నుకుంటూ వస్తున్నాయి. 
 
ఆ తర్వాత 'ప్రేమమ్‌' కూడా మంచి హిట్‌‌గా నిలిచి వరుస పరాజయాల్లో ఉన్న నాగ చైతన్యకు కెరీర్లో మర్చిపోలేని బ్రేక్‌ ఇచ్చింది. ఇక ఆమె తాజాగా నటించిన మూడవ చిత్రం 'శతమానం భవతి' కూడా విపరీతమైన సంక్రాంతి పోటీలో విడుదలై హీరో శర్వానంద్‌, దర్శక నిర్మాతలు ఆశించిన స్థాయి కంటే పెద్ద విజయాన్ని సొంతం చేసుకునేలా కనిపిస్తోంది. తాజాగా ఆమె రామ్‌ చరణ్‌, సుకుమార్‌ చిత్రంలో ఛాన్స్‌ కొట్టేసినట్లు తెలిసింది.