గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: గురువారం, 5 నవంబరు 2020 (19:34 IST)

చిరంజీవి - వినాయక్ మధ్య విభేదాలా..?

మెగాస్టార్ చిరంజీవి - డైనమిక్ డైరెక్టర్ వినాయక్ కాంబినేషన్లో ఠాగూర్ సినిమా రూపొందింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ అయ్యింది. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. ఆ తర్వాత చిరు రీఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150 చిత్రానికి కూడా వినాయకే డైరెక్టర్. ఈ సినిమా కూడా బ్లాక్‌బస్టర్ అయ్యింది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీ లూసీఫర్ రీమేక్ రానుందని వార్తలు వస్తున్నాయి. గత కొన్నిరోజులుగా లూసీఫర్ స్టోరీని తెలుగు నేటివిటికీ తగ్గట్టుగా వినాయక్ మార్పులుచేర్పులు చేసారు.
 
వినాయక్.. చిరంజీవికి కథ వినిపించడం.. చిరు కథలో కొన్ని మార్పులు చేర్పులు చెప్పడం జరిగింది. దీంతో చిరు చెప్పిన మార్పులతో మళ్లీ స్ర్కిప్ట్ వర్క్ స్టార్ట్ చేసారు. అయితే.. ఏమైందో ఏమో కానీ.. లుసీఫర్ రీమేక్‌కి డైరెక్టర్ మారబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. అదేంటి వినాయక్ ఫిక్స్ కదా.. మరి డైరెక్టర్ మారడం ఏంటి అంటారా... కొన్ని రీమేక్స్‌ను టచ్ చేయకూడదు. టచ్ చేస్తే... ఆశించినట్టుగా ప్రేక్షకులను ఆకట్టుకోలేం. ఇది కొన్ని సినిమాల విషయంలో జరిగింది. అందుచేత వినాయక్ ఈ రీమేక్‌ని డైరెక్ట్ చేయడానికి అంతగా ఆసక్తి చూపించడం లేదట.
 
ఈ విషయాన్ని వినాయక్ చిరుకి చెప్పారట. దీంతో చిరంజీవి... వినాయక్ కాకపోతే లూసీఫర్ రీమేక్‌ని హ్యాండిల్ చేయడానికి ఏ డైరెక్టర్ కరెక్ట్ అని ఆలోచనలో పడ్డారని తెలిసింది. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి అసలు ఏమైంది..? అంతా సెట్ అయ్యింది అనుకుంటుంటే.. ఇప్పుడు లూసీఫర్ రీమేక్‌కి డైరెక్టర్ ఎవరైతే బాగుంటారాని ఆలోచనపడడం ఏంటి..? చిరు, వినాయక్ మధ్య విభేదాలు వచ్చాయా..? అని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది.