శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : ఆదివారం, 24 సెప్టెంబరు 2017 (13:08 IST)

'దేవసేన'కు వివాహం.. ఎపుడు?

'బాహుబలి' చిత్రంలో నటించిన హీరో ప్రభాస్, హీరోయిన్‌ అనుష్కల పెళ్ళి ఎప్పుడు అంటూ ప్రతి ఒక్కరూ చర్చించుకున్నారు. కొందరు ప్రభాస్, అనుష్క‌లు కలిసి పెళ్ళి చేసుకోబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగింది. మరి కొంద

'బాహుబలి' చిత్రంలో నటించిన హీరో ప్రభాస్, హీరోయిన్‌ అనుష్కల పెళ్ళి ఎప్పుడు అంటూ ప్రతి ఒక్కరూ చర్చించుకున్నారు. కొందరు ప్రభాస్, అనుష్క‌లు కలిసి పెళ్ళి చేసుకోబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగింది. మరి కొందరు ఈ ఏడాది వీరిరివురు విడివిడిగా వివాహం చేసుకోనున్నారంటూ సాగింది. 
 
అయితే ప్రభాస్ పెళ్ళికి కాస్త టైం పడుతుందని తెలుస్తుండగా, అనుష్క మాత్రం త్వరలోనే పెళ్ళి పీటలెక్కనుందని ఫిలింనగర్ టాక్. 'బాహుబలి' చిత్రం తర్వాత 'జేజెమ్మ' చేసిన భాగమతి చిత్ర షూటింగ్ రీసెంట్‌గా పూర్తైంది. డిసెంబర్‌లో ఈ మూవీ విడుదలకి ప్లాన్ చేస్తున్నారు. అయితే 'భాగమతి' చిత్రం తర్వాత అనుష్క ఏ ప్రాజెక్టుకి సైన్ చేయకపోవడంతో అభిమానులలో అనుమానాలు మొదలయ్యాయి.