మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: మంగళవారం, 5 సెప్టెంబరు 2017 (20:06 IST)

'పైసా వసూల్'ను పచ్చడి పచ్చడి చేసిన పూరీతో బాలయ్య మరో సినిమానా?

'పైసా వసూల్' పేరుకే సినిమా కానీ పైసలు రాల్లేదని ఫస్ట్ షోకే తేలిపోయింది. బాలయ్యను ఉపయోగించుకోవడంలో పూరీ జగన్నాథ్ పూర్తిగా ఫెయిల్ అయ్యాడనే టాలీవుడ్ సినీ జనం చెప్పుకుంటున్నారు. బాలయ్య స్టామినా ఏమిటో తెలిసి కూడా దాన్ని ఉపయోగించుకోవడంలో పూరీ జగన్నాథ్ పూర్

'పైసా వసూల్' పేరుకే సినిమా కానీ పైసలు రాల్లేదని ఫస్ట్ షోకే తేలిపోయింది. బాలయ్యను ఉపయోగించుకోవడంలో పూరీ జగన్నాథ్ పూర్తిగా ఫెయిల్ అయ్యాడనే టాలీవుడ్ సినీ జనం చెప్పుకుంటున్నారు. బాలయ్య స్టామినా ఏమిటో తెలిసి కూడా దాన్ని ఉపయోగించుకోవడంలో పూరీ జగన్నాథ్ పూర్తిగా ఫెయిలయ్యాడని అనుకుంటున్నారు.
 
పూరీ జగన్నాథ్ ఇటీవల తీసిన లోఫర్, జ్యోతిలక్ష్మి, ఇజం చిత్రాలు బాక్సాఫీసు వద్ద బోర్లా పడుకున్నప్పటికీ బాలయ్య పూరీకి చాన్స్ ఇవ్వడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఐతే... బాలయ్యతో ఖచ్చితంగా పూరీ హిట్ కొడతాడని అందరూ అనుకున్నారు. కానీ పైసా వసూల్ చిత్రంతో పచ్చడి పచ్చడి చేసేశాడు పూరీ. 
 
కామెడీ ట్రాక్ లేకుండా బాలయ్యతోనే సెటైర్లు వేయించి వెగటు పుట్టించాడు. ఫలితంగా పైసా వసూల్ ఫ్లాప్ అనే టాక్ మూటగట్టుకుంది. ఐతే తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో వార్త వినిపిస్తోంది. అదేమిటంటే... పూరీకి బాలయ్య మరో ఆఫర్ ఇచ్చాడనేదే. ఇదే నిజమైతే బాలయ్య ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే.