శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: శనివారం, 4 డిశెంబరు 2021 (17:00 IST)

BB5 తెలుగు: డేంజర్ జోన్లో ఆ ఇద్దరు.. సేఫ్ జోన్లో ఆ ముగ్గురు.. ఎవరు?

బిగ్ బాస్ 5 షో సృష్టిస్తున్న హంగామా అంతాఇంతా కాదు. బిగ్ బాస్ షో వచ్చిందంటే చాలు టీవీలకు అతుక్కుని పోతున్నారు జనం. ఎంతో ఆసక్తికరంగా ఉందంటూ ప్రేక్షకులు చెబుతున్నారు. అయితే ఎవరెవరు ఎప్పుడు ఎలిమినేట్ అవుతారన్నదే సస్పెన్స్‌గా ఉంటుంది. 

 
ప్రస్తుతం డేంజర్ జోన్లో కాజల్, ప్రియాంక సింగ్‌లు ఉంటే సేఫ్ జోన్లో శ్రీరామ చంద్ర, మానస్, సిరి హన్మంత్‌లు ఉన్నారట. అయితే సేఫ్ జోన్లో ఉన్న వారికి కావాల్సినంత ఓట్లు పోలయ్యాయట. దీంతో వారు సేఫ్ జోన్లోనే ఉండిపోయారట. 

 
కానీ కాజల్, ప్రియాంకలకు మాత్రం ఎవరూ ఓటు వేయడానికి ముందుకు రావడం లేదట. కానీ శ్రీరామచంద్ర, మానస్, సిరి హన్మంత్‌లకు మాత్రం ఓట్లు వేస్తున్నారట. ముఖ్యంగా శ్రీరామచంద్రకు ఎక్కువగా ఓట్లు పడ్డాయట. అయితే ఈ విషయాన్ని పూర్తిగా గోప్యంగా ఉంచుతున్నారట నిర్వాహకులు. 

 
ఎవరి ఆటతీరు ఏ స్థాయిలో ఉందన్నది ప్రేక్షకులకు తెలిసిందే. అయితే ప్రియాంక, కాజల్‌లు నీరసంగా ఆడుతుండడం.. పెద్దగా ఇంట్రస్ట్ లేదన్నట్లు వారు వ్యవహరిస్తున్న తీరు మాత్రం ప్రేక్షకులను బాగా నిరుత్సాహ పరుస్తోందట. మరి చూడాలి. ఎవరు ఎలిమినేట్ అవుతారో.. ఎవరు విజేతగా నిలుస్తారన్నది.