శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

డేంజర్ జోన్స్‌లో ఆటలొద్దు... పట్టుతప్పిందో ప్రాణాలు గాల్లోకే

నేటి యువత సెల్ఫీల మోజులో మునిగితేలుతోంది. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు ప్రమాదపుటంచుల్లో నిలబడి సెల్ఫీ తీసుకోవాలని ఆరాటపడుతున్నారు. అయితే, ఆ సెల్ఫీ మోజే వారి పాలిట యమపాశంలా మారుతోంది. ముందు వెనుకా ఆలోచించకుండా డేంజర్ జోన్‌లలోనూ సెల్ఫీలు దిగుతూ ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. 
 
ఇలాంటి ఘటనలు తెలంగాణలోని జలపాతాల వద్ద అనేకం చోటు చేసుకున్నాయి. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలోని కుంటాల జలపాతానికి సందర్శకులను అనుమతించడంతో.. నాటి ప్రమాద ఘటనను అధికారులు గుర్తు చేశారు. 
 
సందర్శకులు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. డేంజర్ జోన్‌లో గేమ్స్ వద్దు అని హెచ్చరిస్తున్నారు. జలపాతాల వద్ద జాగ్రత్తగా ఉండాలని.. పట్టు తప్పితే ప్రాణాలు పోగొట్టుకుంటారని హితవుచెబుతున్నారు.