గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 11 జులై 2021 (08:42 IST)

తెలంగాణాలో నేడు రేపు వర్షాలు

తెలంగాణా రాష్ట్రంలో నేడు రేపు విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. దీనికి కారణం ఆ రాష్ట్రంలో రుతుపవనాలు చురుకుగా కదలడమే. ఈ రుతుపవనాల కారణంగా ఇప్పటికే గత కొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా చెదురుమదురు వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆది, సోమవారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ పేర్కొంది.
 
మరోవైపు బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాల వద్ద నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయి. గాలులతో ఆ ప్రాంతంలో ఇప్పటికే ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్టు అధికారులు తెలిపారు. తూర్పు, పశ్చిమ ప్రాంతాల మధ్య గాలులతో ద్రోణి ఏర్పడినట్టు వాతావరణ కేంద్రం పేర్కొంది.