పానీపురీ వాలాను పెళ్లిచేసుకోవాలనుకున్నా.. ఇప్పుడిక పెళ్లే వద్దు..? (video)
బిగ్ బాస్ 2 బ్యూటీ తేజస్వి పెళ్లి చేసుకోనంటోంది. తొలిసారి తన పెళ్లి విషయంపై ఆసక్తికర విషయాన్న వెల్లడించింది. మనం, కేరింత, ఐస్క్రీం వంటి చిత్రాల్లో సందడి చేసిన తేజస్వీ మడివాడ.. అసలు పెళ్లి చేసుకోవద్దనే నిర్ణయానికి వచ్చేసింది. 'ఐస్క్రీం' సినిమాతో కుర్రకారు మనసుల్లో హీట్ పుట్టించిన ముద్దుగుమ్మ తేజస్వీ... తాను పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదని చెప్పుకొచ్చింది.
అలాగే ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా బీచ్లో ఫోజులిస్తూ...'చిన్నప్పుడు నేను పానీపురీ వాలాను పెళ్లిచేసుకోవాలని అనుకున్నాను. కానీ ఇప్పుడు నేను చిన్నపిల్లను కాదు. అసలు పెళ్లే అవసరం లేదని తెలుసుకున్నాను.'' అని తన ఇన్స్టాలో పోస్టు చేసింది. తేజస్వీ గతంలో సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, మనం, కేరింత, హార్ట్ ఎటాక్ తదితర చిత్రాల్లో మెరిసింది. బిగ్బాస్-2 లోనూ పాల్గొని అలరించింది.