1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By chitra
Last Updated : శుక్రవారం, 13 మే 2016 (12:11 IST)

చిరంజీవి 150వ చిత్రంలో హీరోయిన్‌గా అనుష్క?

మెగాస్టార్ చిరంజీవి నటించే 150వ సినిమా వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. తమిళంలో హిట్టయిన ‘కత్తి' చిత్రాన్ని తెలుగులో ''కత్తిలాంటోడు'' టైటిల్‌తో రీమేక్ చేస్తున్నారు. తెలుగు నేటివిటీకి అనుగుణంగా స్క్రిప్టులో చాలా మార్పులు చేసారు వినాయక్. ఇక ఈ సినిమాలో చిరంజీవి సరసన ఎవరు నటిస్తారు? అనేది చాలా కాలంగా హాట్ టాపిక్‌గా మారింది. 
 
ఈ చిత్రం కోసం ఇప్పటికే త‌మ‌న్నా.. రెజీనా.. న‌య‌న‌తార‌.. అనుష్క ఇలా పలువురు హీరోయిన్ల పేర్లను పరిశీలిస్తున్నారు. తాజాగా దర్శకుడు ఓ క‌త్తిలాంటి హీరోయిన్‌ను ఫిక్స్ చేసిన‌ట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఈ సినిమాలో చిరుకు జోడీగా ముందుగా న‌య‌న‌తార‌, త‌ర్వాత అనుష్క పేర్లు వినిపించినా ఫైన‌ల్‌గా అనుష్క‌నే ఫిక్స్ చేసిన‌ట్టు సమాచారం. 
 
గ్లామర్‌తోపాటు, నటనలోనూ అనుష్క చిరుకి కరెక్ట్‌గా సెట్ అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తోందట. ప్ర‌స్తుతం 'బాహుబ‌లి-2'లో నటిస్తున్న అనుష్క ఈ సినిమాతో పాటు చిరు 150వ సినిమాకు కూడా డేట్లు ఇచ్చిందట. కొణిదెల ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై తెర‌కెక్కుతున్న ఈ సినిమాకు దేవిశ్రీప్ర‌సాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.