ఆదివారం, 23 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By దేవి
Last Updated : శనివారం, 22 ఫిబ్రవరి 2025 (10:51 IST)

ఓ.టి.టి.కోసం డాకు మహారాజ్ చిత్రమైన ప్రమోషన్ !

Balakrishna, Urvashi Rautela
Balakrishna, Urvashi Rautela
నందమూరి  బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ దియేటర్ లో పెద్దగా ఆడకపోయినా హిట్ సినిమాగా ప్రమోషన్ తెచ్చుకుంది. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ ఓ.టి.టి.లో వచ్చేసింది. ఓ.టి.టి. లో రావడానికి ముందు ఊర్వశి రౌటేలా సీక్వెన్స్‌లు, దబిడి దబిడి పాటతో సహా కొన్ని సన్నివేశాలను తొలగించారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దానిపై దర్శకుడు బాబీ కొల్లి కూడా తనకేమి తెలియదని చెప్పారు. ఈ గురువారం నాడు నెట్‌ఫ్లిక్స్‌లో డాకు మహారాజ్ స్ట్రీమింగ్ ప్రారంభమైంది.
 
అయితే, ఈ సినిమా చూసినప్పుడు ఈ చిత్రం ఎటువంటి కటింగ్స్ లేవని అర్ధమయింది. ప్రతి సన్నివేశం స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లో చెక్కుచెదరకుండా ఉంది. సినిమా విడుదలకు ముందు పుబ్లిసిటి రకరకాలుగా చేయడం సహజమే. కాని ఓ.టి.టి.కోసం పడిపోయిన సినిమాను లేపెందుకు ఇలా చేస్తున్నారని ట్రేడ్ వర్గాలు తెలియజేస్తున్నాయి.  డాకు మహారాజ్ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జనవరి 12న విడుదలైంది. ఈ చిత్రం మొదటి వారంలో బాగుందని టాక్ ఉన్నా పోటీ సినిమా  కారణంగా ఆ తర్వాత కలెక్షన్లు పడిపోయాయి.