మంగళవారం, 15 జులై 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : సోమవారం, 28 నవంబరు 2016 (16:42 IST)

కత్రినా కైఫ్‌కు బాయ్‌ఫ్రెండ్ వేధింపులు... బీటౌన్‌లో రసవత్తర చర్చ!

బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మోస్ట్ పాపులర్ ప్రేమ పక్షులుగా పేరు సంపాదించుకున్న జంట కత్రినా కైఫ్ - రణ్‌బీర్ కపూర్. వీరిద్దరూ గత ఐదేళ్లుగా ఇండస్ట్రీలో ప్రేమికులుగా ఉన్నారు. ఒక దశలో ఇద్దరూ పెళ్లిచేసుకునే వర

బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మోస్ట్ పాపులర్ ప్రేమ పక్షులుగా పేరు సంపాదించుకున్న జంట కత్రినా కైఫ్ - రణ్‌బీర్ కపూర్. వీరిద్దరూ గత ఐదేళ్లుగా ఇండస్ట్రీలో ప్రేమికులుగా ఉన్నారు. ఒక దశలో ఇద్దరూ పెళ్లిచేసుకునే వరకూ వెళ్ళారు. కానీ చివరి నిముషంగా పెళ్లికి సంబంధించిన పనులు వాయిదా పడ్డాయి. అప్పటి నుంచి వీరిద్దరూ కొంత గ్యాప్‌ని మెయింటెన్ చేస్తూ వస్తున్నారు.
 
అయితే పెళ్ళి విషయంలో కత్రినాకైఫ్‌ని రణ్‌బీర్ కపూర్ మోసం చేశాడనే పుకార్లు బాలీవుడ్‌లో షికారు చేస్తున్నారు. అందుకే కత్రినాకైఫ్ - రణ్‌బీర్ కపూర్‌పై కోపంగా ఉందని అంటున్నారు. నిజంగానే గత రెండు రెండేళ్లుగా వీరిద్దరూ కలిసి ఉండటంలేదు. గతంలో పబ్లిక్ ప్లేస్‌‌లకి కలిసి వెళ్ళిన వీరిద్దరూ... ఇప్పుడు ఎవరికి వారు దూరంగా ఉంటున్నారు. 
 
ఈ పరిస్థితుల్లో గతంలో కత్రినాకైఫ్ కాంబినేషన్‌లో చేసిన మూవీలలో రణ్‌బీర్ కపూర్ చుక్కలు చూపించాడని అంటున్నారు. ప్రస్తుతం రణ్‌బీర్ కపూర్ ఇతర హీరోయిన్స్ బిజిగా ఉండగా, కత్రినాకైఫ్ సైతం ఇతర హీరోలతో బిజి అయింది. ఇలా వీరిద్దరి ప్రవర్తన కారణంగా కత్రినాకైఫ్ - రణ్‌బీర్ కపూర్ పూర్తిగా విడిపోయనట్టే అని భావిస్తున్నారు. అయితే వారంరోజుల క్రితం కత్రినాకైఫ్ మళ్ళీ రణ్‌బీర్ కపూర్ టాపిక్‌ని మీడియా ముందుకు తీసుకువచ్చింది. ఎవ్వరూ అడక్కుండానే బాయ్ ప్రెండ్ టాపిక్‌ని తీసుకురావటంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.
 
ఇందులో విషయం ఏమిటంటే రణ్‌బీర్ కపూర్ ఇప్పటికీ తనని టార్చర్ పెడుతూనే ఉన్నాడని, అందుకే తన నుండి ఇంకా దూరంగా ఉంటున్నానని చెప్పుకొచ్చింది. ఏ విషయంలో ఇబ్బంది పెడుతున్నాడనే ప్రశ్న వేయగానే ఆమె సైలెంట్‌గా ఉండిపోయారు. మొత్తంగా వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ ఇంకా కంటిన్యూ అవుతుందనే విషయాన్ని మీడియా హైలెట్ చేస్తూ చూపిస్తుంది.