శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 8 సెప్టెంబరు 2017 (14:25 IST)

"టార్చ్ లైట్" వెలుతురులో వేశ్యగా సదా!

తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్‌గా చెలామణి అయిన సదా ఇపుడు సినీ అవకాశాలు లేకుండా బుల్లితెరకు పరిమితమైంది. పలు షోల్లో న్యాయ నిర్ణేతగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో 'టార్చ్ లైట్' అనే తమిళ సినిమా చేయడానికి అంగీ

తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్‌గా చెలామణి అయిన సదా ఇపుడు సినీ అవకాశాలు లేకుండా బుల్లితెరకు పరిమితమైంది. పలు షోల్లో న్యాయ నిర్ణేతగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో 'టార్చ్ లైట్' అనే తమిళ సినిమా చేయడానికి అంగీకరించింది. 
 
ఈ సినిమాలో ఆమె వేశ్య పాత్రలో కనిపించనుంది. అందమైన కలలతో.. ఆశలతో.. ఆశయాలతో ఉన్న ఓ అమ్మాయి, ఎలాంటి పరిస్థితుల్లో వేశ్యగా మారిందనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది.
 
దర్శకుడు అబ్దుల్ మజీద్ తన దగ్గరికి వచ్చి.. ఒక వేశ్య చుట్టూ తిరిగే కథ అని చెప్పినప్పుడు చేయకూడదని అనుకున్నాననీ, కానీ ఆ తర్వాత ఆయన కథ చెబుతుంటే కన్నీళ్లు వచ్చాయని సదా అంది. అందుకే ఈ సినిమాను అంగీకరించానని చెప్పింది. 
 
చాలామంది కథానాయికలు ఆసక్తి చూపని ఈ పాత్ర, సదాకి ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ 'తిరునల్వేలి' పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ చిత్రం షూటింగ్‌ను వీలైనంత మేరకు త్వరగా పూర్తి చేసిన సంక్రాంతికి రిలీజ్ చేయాలన్న ప్లాన్‌లో నిర్మాత ఉన్నారు.