శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?
హీరో వరుణ్ తేజ్ కంచెలో నటించిన ప్రగ్యా జైశ్వాల్ ప్రస్తుతం ఓ ప్రముఖ క్రికెటర్ ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. ఇటీవల ప్రగ్యా జైశ్వాల్ ఖేల్ ఖేల్ మేలో అక్షయ్ కుమార్‌తో కలిసి కనిపించింది. తాజాగా టీమిండియా స్టార్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ జైస్వాల్ ప్రేమలో పడినట్లు టాక్ వస్తోంది.
తాజా ఇంటర్వ్యూలో క్రికెటర్ గిల్ క్యూట్. అతని గురించి అనుకూలంగానూ, వ్యతిరేకంగానూ తాను మాట్లాడలేదు. అయితే తాను ఒంటరిగా వున్నానని చెప్పింది. ప్రగ్యా 2014 తమిళ థ్రిల్లర్ 'విరాట్టు'లో అరంగేట్రం చేసింది. అప్పటి నుండి వెనక్కి తిరిగి చూసుకోలేదు.
దక్షిణాదిలో తన స్థానాన్ని పదిలపరుచుకోవడానికి తెలుగు సినిమాలు కూడా చేసింది. ఇటీవల, ఆమె 'ఖేల్ ఖేల్ మే'తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది, ఇందులో ఆమె అక్షయ్ కుమార్, వాణి కపూర్, ఫర్దీన్ ఖాన్, అమ్మీ విర్క్, తాప్సీ పన్ను, ఆదిత్య సీల్‌లతో కలిసి పనిచేసింది.