పాయల్ రాజ్ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?
ప్రభాస్ పెళ్లి గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభాస్ తన జీవితంలోని ప్రత్యేకమైన వ్యక్తిని త్వరలో పరిచయం చేయబోతున్నాడంటూ ఉదయాన్నే ఒక పోస్ట్‌ను పంచుకున్నాడు. దీంతో అతడి పెళ్లి ప్రకటన రాబోతోందని అందరూ భావించారు.
ఇకపోతే.. రెండు రోజుల క్రితం హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ "నేను ఎవరికైనా డార్లింగ్‌గా ఉంటాను" అని పాయల్ పోస్టు చేసింది. ఓ ఇంటర్వ్యూలో పాయల్ ప్రభాస్ గురించి చాలా గొప్పగా మాట్లాడింది. ప్రభాస్ ఇతరులకు ఆహారం అందించడం ఎలా ఇష్టమో చెప్పింది.
ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ పుణ్యమా అంటూ ప్రభాస్- పాయల్ మధ్య మ్యారేజ్ ట్రాక్ నడుస్తోంది. ఈ ఇంటర్వ్యూలు, పాయల్ పోస్టులు ప్రభాస్ పెళ్లికి లింక్ చేసేస్తున్నారు. ప్రభాస్ - పాయల్ ప్రేమలో ఉన్నారని, వారి పెళ్లి ప్రకటన రాబోతోందని సమాచారం. అయితే ఈ వ్యవహారంలో ఎంత నిజముందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.