గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: గురువారం, 30 జులై 2020 (21:11 IST)

మర్డర్ మూవీ విషయంలో వర్మ ప్లాన్ మారడానికి కారణం ఇదేనా..?

ట్రెండ్ సెట్టర్ చిత్రాల దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎప్పటికప్పుడు విభిన్న కథలతో సినిమాలను చేస్తున్న సంగతి తెలిసిందే. సంచలన సామాజిక యదార్ధ ఘటనలతో పాటు పలు బయోపిక్ చిత్రాలను తీస్తూ తనదైన ప్రత్యేకతతో ముందుకు సాగుతున్న ఆయన తాజాగా తీసిన ‘మర్డర్’ (కుటుంబ కథా చిత్రం) సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ చిత్రం ట్రైలర్‌ను మంగళవారం ఉదయం విడుదల చేశారు.
 
ట్రైలర్ విడుదలైన కొద్ది సమయానికే విశేష ఆదరణకు నోచుకోవడం ఓ విశేషం. ఆ మధ్య జరిగిన ఒక సంచలన యదార్ధ ప్రేమ హత్య ఉదంతాన్ని ఆధారం చేసుకుని వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దీనికి ఆనంద్ చంద్ర దర్శకత్వం వహించారు.
 
శ్రీకాంత్ అయ్యంగార్, సాహితి తదితరులు ప్రధాన పాత్రలను పోషించారు. నట్టీస్ ఎంటర్టైన్మెంట్, క్విటీ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై అనురాగ్ కంచర్ల సమర్పణలో నట్టి కరుణ, నట్టి క్రాంతి నిర్మిస్తున్నారు.
 
రాంగోపాల్ వర్మ ముందు నుంచి చెబుతున్నట్లుగా ఎవరినీ కించపరచాలని ఈ చిత్రాన్ని తీయలేదని, భావ స్వేచ్ఛను దృష్టిలో పెట్టుకొని యదార్ధ ఘటనతో వర్మ రూపొందించడం జరిగిందని నిర్మాతలు నట్టి కరుణ, నట్టి క్రాంతి తెలిపారు. దాదాపు రెండు గంటల వ్యవధి గల ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తాం. ఆగస్ట్ నాటికి సినిమా తొలి కాపీ సిద్ధమవుతుంది. ఆదే నెలలో సెన్సార్‌కు పంపుతాం అని నిర్మాతలు వెల్లడించారు.
 
అయితే... వర్మ తీసిన సినిమాలు ఏటీటీ ఫ్లాట్ఫామ్ ద్వారా రిలీజ్ చేసారు. వీటికి మంచి స్పందన రావడం.. లాభాలు కూడా బాగా రావడంతో తదుపరి చిత్రాలను కూడా ఏటీటీ ద్వారానే రిలీజ్ చేస్తారనుకున్నారు కానీ.. మర్డర్ మూవీని మాత్రం థియేటర్లోనే రిలీజ్ చేస్తామని ప్రకటించారు. దీంతో వర్మ మర్డర్ మూవీ విషయంలో ప్లాన్ మార్చడానికి కారణం ఏంటి అనేది ఆసక్తిగా మారింది. విషయం ఏంటంటే.. ఈ సినిమా నిజ జీవిత సంఘటనలు ఆధారంగా రూపొందుతుండడంతో మంచి క్రేజ్ ఉంది. అందుచేత దీనిని థియేటర్లో రిలీజ్ చేస్తే మంచి లాభాలు వస్తాయనే ఉద్దేశ్యంతోనే ఇలా ప్లాన్ చేస్తున్నారని టాక్.