శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By
Last Updated : మంగళవారం, 27 నవంబరు 2018 (15:32 IST)

అమలాపాల్ రెండో పెళ్లి.. ఆ హీరోతోనా?

దర్శకుడు విజయ్‌ని ప్రేమించి పెళ్లాడి.. విడాకులు తీసుకున్న అమలా పాల్ రెండో పెళ్లికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా రాక్షసన్ సినిమాలో నటించిన అమలాపాల్.. ఆ సినిమాలో హీరోగా నటించిన విష్ణును పెళ్లాడనున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. గతంలో విష్ణు తన భార్య రజనీకి విడాకులు ఇచ్చినట్లు తెలుస్తోంది. 
 
తన కుమార్తె ఆర్యను బాగా చూసుకుంటున్న విష్ణు.. రెండో వివాహానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాక్షసన్ సినిమా సందర్భంగా అమలాపాల్‌-విష్ణుల మధ్య ప్రేమ చిగురించిందని.. ఈ సినిమా హిట్ టాక్ సంపాదించడంతో.. ఈ జంట త్వరలోనే వివాహం చేసుకోనున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం.