శనివారం, 25 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (15:34 IST)

నేను షూటింగులకు రాను, నన్ను పిలవకండి అంటున్న జగపతి బాబు

విలక్షణ నటుడు జగపతి బాబు తను షూటింగులకు రాలేనని చెప్పాడట. తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ విపరీతంగా వ్యాపిస్తుండటం, కొందరు సెలబ్రిటీలు ఇప్పటికే కరోనా బారిన పడటంతో మిగిలివారు బెంబేలెత్తిపోతున్నారు. దీనితో కొంతకాలం షూటింగులకు బ్రేక్ తీసుకోవాలని నిర్ణయం తీసుకుంటున్నారు.
 
తాజాగా జగపతి బాబు కూడా కరోనా తీవ్రత తగ్గేవరకూ షూటింగులలో పాల్గొనలేనని చెప్పేశాడట. ప్రస్తుతం జగపతి బాబు శర్వానంద్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రలలో రూపొందుతున్న మహాసముద్రం చేస్తున్నాడు. ఇటీవలే కరోనా తనను మేకప్‌మేన్ చేసిందంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.