శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By
Last Updated : మంగళవారం, 9 జులై 2019 (10:02 IST)

జస్ప్రీత్ బుమ్రాతో అనుపమా డేటింగ్?

భారత క్రికెట్ జట్టు బౌలర్ జస్ప్రీత్ బుమ్రా డేటింగ్‌లో ఉన్నారా? ఆయన డేటింగ్‌లో ఉన్నది ఎవరితోనో తెలుసా? మలయాళ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్. ఈ వార్తలను ఈమె ఖండిచకపోగా, బుమ్రా తనకు మంచి ఫ్రెండ్ అంటూ చెప్పుకొచ్చింది. 
 
నిజానికి గతంలో జస్ప్రీత్ సింగ్ బుమ్రా హీరోయిన్ రాశీఖన్నాతో డేటింగ్ చేస్తున్నట్టు గుసగుసలు వినిపించాయి. ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాసీఖన్నా క్లారిటీ ఇచ్చింది కూడా. బుమ్రా ఎవరో తనకు వ్యక్తిగతంగా తెలియదని, తానెప్పుడూ అతడిని కలవలేదని తెలిపింది. బుమ్రా క్రికెటర్ అని మాత్రం తనకు తెలుసని పేర్కొంది. 
 
ఇపుడు అనుపమా పరమేశ్వరన్‌తో బుమ్రా డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదనీ తామిద్దరం మంచి స్నేహితులమని చెప్పుకొచ్చింది. కెటర్లతో లింకులు పెట్టి వార్తలు సృష్టించడం మామూలేనని పేర్కొంది. 
 
కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో ఆడుతున్న బుమ్రా అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ మెగాటోర్నీలో ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన బుమ్రా 17 వికెట్లు తీసుకుని అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.