శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : మంగళవారం, 2 మే 2017 (12:23 IST)

'ఈ రాత్రికి మాతోనే గడుపుదువుగాని రా' అంటూ కన్నడ నటిపై లైంగికదాడికి యత్నం!

ఇటీవలికాలంలో నటీమణులపై లైంగిక దాడులు పెరిగిపోతున్నాయి. తాజాగా కన్నడ నటి వంతు వచ్చింది. వర్ధమాన నటిపై కొందరు వ్యక్తులు లైంగికదాడికి తెగబడ్డారు. మొన్నటికిమొన్న నటి భావనను కిడ్నాప్ చేసి అత్యాచారం చేయబోయి

ఇటీవలికాలంలో నటీమణులపై లైంగిక దాడులు పెరిగిపోతున్నాయి. తాజాగా కన్నడ నటి వంతు వచ్చింది. వర్ధమాన నటిపై కొందరు వ్యక్తులు లైంగికదాడికి తెగబడ్డారు. మొన్నటికిమొన్న నటి భావనను కిడ్నాప్ చేసి అత్యాచారం చేయబోయిన విషయం తెల్సిందే. ఈ ఘటన మరచిపోకముందే ఇపుడు కన్నడ వర్ధమాన నటి ఘటన వెలుగులోకి వచ్చింది. అదీ బెంగుళూరులో నడి రోడ్దుమీదే ఇద్దరు యువకులు దాడికి తెగబడటం సంచలనం రేపుతోంది. 
 
బెంగళూరు రాజగోపాలనగర ఠాణా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సినిమా షూటింగ్‌లో పాల్గొని హెగ్గనహళ్లి వద్ద క్యాబ్‌ దిగి ఇంటికి వెళ్తున్న సినీనటిని సచిన్‌, ప్రవీణ్‌ అలియాస్‌ పుట్ట అనే ఇద్దరు అకతాయిలు అడ్డగించారు. "ఈ రాత్రికి మాతోనే గడుపుదువుగాని రా..." అంటూ ఇద్దరూ చెరో చేతిని పట్టుకుని ఆమెను బలవంతంగా లాక్కొని పోయేందుకు ప్రయత్నించారు. 
 
దీనికి ఆమె తీవ్రంగా ప్రతిఘటించడం, రోడ్డుమీద వెళుతున్న జనం కూడా ఆమెకి రక్షణగా రావటంతో వెనకడుగు వేసిన ఆ ఇద్దరు యువకులూ, ఆమెను దూషిస్తూ, దాడిచేసి పరారయ్యారు. ఆ తర్వాత నటి ఫిర్యాదుతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదులో వారిద్దరితో తనకి మూడేళ్లుగా పరిచయం ఉందని, వారి వేధింపులతో గతంలో ఆత్మహత్యాయత్నం కూడా చేశానని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితులిద్దర్నీ అదుపులోకి తీసుకున్నారు. అయితే, దాడి జరిగిన వర్ధమాన నటి పేరును పోలీసులు వెల్లడించలేదు.