శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , గురువారం, 11 మే 2017 (09:37 IST)

ప్రభాస్‌కు కరణ్ జోహార్ చేసిన ఆఫర్ రూ.100 కోట్లు.. డైలమ్మాలో యంగ్ రెబల్ స్టార్

బాహుబలి-2 సాధించిన గ్రాండ్ సక్సెస్‌తో ఆ చిత్ర హీరో ఒక్కసారిగా జాతీయ హీరో అయిపోయాడు. ప్రభాస్‌కు ఏర్పడిన క్రేజ్‍ను వందల కోట్ల రూపాయలలోకి మార్చుకోవాలని ఎందరో బాలీవుడ్ నిర్మాతలు ప్రభాస్ వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ప్రభాస్‌కు ఇచ

బాహుబలి-2 సాధించిన గ్రాండ్ సక్సెస్‌తో ఆ చిత్ర హీరో ఒక్కసారిగా జాతీయ హీరో అయిపోయాడు. ప్రభాస్‌కు ఏర్పడిన క్రేజ్‍ను వందల కోట్ల రూపాయలలోకి మార్చుకోవాలని ఎందరో బాలీవుడ్ నిర్మాతలు ప్రభాస్ వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ప్రభాస్‌కు ఇచ్చిన లేటెస్ట్ ఆఫర్ ప్రభాస్‌ను ఆలోచనలో పడవేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ మీడియా రాస్తున్న వార్తల ప్రకారం కరణ్ జోహార్ ప్రభాస్‌తో రెండు సినిమాల డీల్ కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కరణ్ ఇప్పటికే యంగ్ రెబల్ స్టార్‌తో పలుమార్లు చర్చలు జరిపినట్లు కూడా తెలుస్తోంది. 
 
అయితే ప్రభాస్ అమెరికాలో ఉండటంతో కేవలం ఫోన్ ద్వారా మాత్రమే ఈ చర్చలు జరుగుతున్నాయని, వచ్చే నెల ప్రభాస్ అమరికా నుంచి తిరిగి వస్తూ, నేరుగా ముంబై వెళ్లబోతున్నారని బాలీవుడ్ మీడియా వార్తలు రాస్తోంది. దీని ప్రదాన ఉద్దేశం డీల్ పైనలైజ్ చేసుకోవడమేనని చెబుతున్నారు. ప్రభాస్ సన్నిహితులు కూడా కరణ్ జోహార్‌తో డీల్ విషయమై సానుకూలంగానే రియాక్ట్ అవుతున్నట్లు టాక్.  కరణ్ జోహార్ ఇచ్చిన డీల్‌లో వంద కోట్ల పారితోషికంతో పాటు, ఆ రెండు సినిమాలకు సంబంధించి జరగబోయే బిజినెస్‌లో షేర్ కూడా కరణ్ ప్రభాస్‌కు ఆఫర్ చేశాడని బాలీవుడ్ మీడియా వార్తలు రాస్తోంది. 
 
అయితే ప్రభాస్ అమెరికా నుంచి వచ్చిన వెంటనే తన సొంత నిర్మాణ సంస్థ  సాహో మూవీ షూటింగులో బిజీ అవుతాడు కాబట్టి, ఈ మూవీ పూర్తయిన తర్వాత మాత్రమే కరణ్ జోహార్‌తో డీల్ ఒక తుదిరూపానికి రావచ్చని అంటున్నారు. ప్రస్తుతం అమెరికాలోనూ, ఇతర దేశాల్లోనూ బాహుబలి గురించి జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఇప్పుడు హాలీవుడ్ సూపర్ క్యారెక్టర్స్ సరసన బాహుబలి చేరిపోయాడు. దీనితో ప్రభాస్ అడిగితే ఎన్ని కోట్లు ఇవ్వడానికైనా ఇవ్వడానికి బాలీవుడ్ నిర్మాతలు రెడీగా ఉన్న నేపథ్యంలో రానున్న రోజుల్లో ప్రభాస్ పారితోషికం ఇండియన్ సినిమా స్టార్స్ లోనే నంబర్ వన్ స్థానానికి చేరుకున్నా ఆశ్చర్యపోవలిసిన పని లేదు.