గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 28 అక్టోబరు 2020 (14:28 IST)

'ఆచార్య' చెల్లిగా 'మహానటి' - గుండు గెటప్‌లో కనిపించనున్న చిరు?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం "ఆచార్య". కొరటాల శివ దర్శకత్వం వహిస్తుంటే కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం తర్వాత చిరంజీవి మరో ప్రాజెక్టులో నటించనున్నారు. తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన "వేదాళం" చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేయనున్నారు. ఈ చిత్రానికి చిరంజీవి కజిన్ మెహర్ రమేశ్ దర్శకత్వం వహింనున్నారు. 
 
ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పని ఇప్పటికే పూర్తి కాగా, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇక ఈ చిత్రంలో హీరో సోదరి పాత్ర ఒకటి వుంది. ఇది చాలా కీలకమైన పాత్ర కావడంతో దీనికి హోమ్లీ ఇమేజ్తో పాటు అభినయాన్ని ప్రదర్శించగలిగే కథానాయికను తీసుకోవాలనుకున్నారు. 
 
ఈ క్రమంలో సాయిపల్లవి, కీర్తి సురేశ్‌లను పరిశీలించారు. చివరికి కీర్తి సురేశ్ వైపు చిరంజీవి మొగ్గు చూపించడంతో ఆమెను ఫైనల్ చేశారని తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం ఆమె డేట్స్ విషయంలో సంప్రదింపులు జరుపుతున్నారట.
 
మరోవైపు, వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ చిత్రం షూటింగును నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో చిరంజీవి గుండుతో కనిపిస్తారని అంటున్నారు. అందుకే ఆమధ్య గుండు గెటప్‌తో ట్రయిల్ ఫొటోలు తీసుకుని సోషల్ మీడియాలో ఆయన వదిలారు.